Markapuram: రైతులందరూ రీసర్వేలో భాగస్వాములు కావాలి.. తహసీల్దార్ పిలుపు

Markapuram: మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ చిరంజీవి ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 April 2026 12:18 PM IST
Markapuram
X

Markapuram: రైతులందరూ రీసర్వేలో భాగస్వాములు కావాలి.. తహసీల్దార్ పిలుపు

Markapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమానికి మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. సర్వే నంబర్ 231లో గల హద్దు రాయి వద్ద పూజలు నిర్వహించి తహసీల్దార్ కె. చిరంజీవి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో ప్రతి రైతు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భూముల హద్దులు స్పష్టతతో నమోదవ్వడం, భూ వివాదాలు తగ్గడం వంటి ప్రయోజనాలు ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయర్, రెవెన్యూ మరియు సర్వే సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story