Markapuram: మార్కాపురం జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను ఉద్యమంగా కొనసాగించాలి
Markapuram: మార్కాపురం కంభం సెంటర్‌లో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
Markapuram: మార్కాపురం జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను ఉద్యమంగా కొనసాగించాలి
మార్కాపురం: శుభ్రతకు ప్రాధానమిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని కంభం సెంటర్ లో శనివారం నిర్వహించిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్ 'కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మురుగు కాల్వలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, బాటిల్స్ వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ తో పర్యావరణానికి తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు.
ప్లాస్టిక్ రహిత మార్కాపురం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కాలువలన్నీ శుభ్రం చేయాలన్నారు. ఎక్కడైనా అశుభ్రంగా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అందరి భాగస్వా మ్యంతో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరు ద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణ రావు,టీడీపీ నాయకులు పఠాన్ ఖాన్, గుంటక సుబ్బారెడ్డి, రామాంజి రెడ్డి, నాలి కొండయ్య యాదవ్, జనసేన రాష్ట్ర డైరెక్టర్ సాదిక్, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




