Markapuram: పెద్ద యాచవరం ముస్లిం స్మశాన వాటికను యథావిధిగా కొనసాగించాలి

Markapuram: ముస్లిం స్మశాన వాటికను యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 19 Jun 2026 4:28 PM IST
Markapuram
X

Markapuram: పెద్ద యాచవరం ముస్లిం స్మశాన వాటికను యథావిధిగా కొనసాగించాలి

మార్కాపురం: మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామంలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన ముస్లిం స్మశాన వాటికను యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజా సమస్యల పరిష్కార యాత్రలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయన, స్థానిక ముస్లిం కుటుంబాలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. దాదాపు 40 ముస్లిం కుటుంబాలు రెండు శతాబ్దాలుగా వినియోగిస్తున్న స్మశాన వాటికను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

కొంతమంది స్మశాన వాటిక భూమిని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో తాగునీటి సమస్యను కూడా అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.

అనంతరం పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోతో సమావేశమైన డాక్టర్ మహబూబ్ వలి, స్మశాన వాటిక పరిరక్షణతో పాటు తాగునీటి సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story