Konakanamitla: పోలీస్ స్టేషన్‌లో భర్త ఆత్మహత్యా యత్నం.. తీవ్ర కలకలం!
Konakanamitla: కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మనస్తాపంతో జగదీష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
Konakanamitla: పోలీస్ స్టేషన్‌లో భర్త ఆత్మహత్యా యత్నం.. తీవ్ర కలకలం!
Konakanamitla: మనస్తాపంతో ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మార్కాపురం జిల్లా కొనకనమిట్లలో చోటుచేసుకుంది. నాగంపల్లికి చెందిన ప్రసన్న, జగదిష్‌లకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. జగదీష్ మద్యం తాగి హింసిస్తున్నాడని ప్రసన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కౌన్సిలింగ్‌కు రావాలని పోలీసులు జగదిష్ తల్లికి సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ కొసం స్టేషన్‌కు వెళ్లిన జగదీష్ ఫిర్యాదు వెనక్కి తీసుకుని, కాపురానికి రవాలని తన భార్యను కోరాడు. ప్రసన్న కాపురానికి వెళ్లడానికి ఒప్పుకుంది కానీ ఆమె తల్లి నిరాకరించింది.
ముందుగానే షర్ట్‌పై పెట్రోల్ చల్లుకుని వచ్చిన జగదీష్ మనస్తాపానికి గురై లైటర్‌తో నిప్పంటించుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమై పోలీసులు మంటలను ఆర్పి జగదీష్‌ను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.




