Markapur: కాంగ్రెస్‌లోకి జమ్మనపల్లి గ్రామానికి చెందిన 18 కుటుంబాలు
Markapur: మార్కాపురం మండలం జమ్మనపల్లికి చెందిన 18 కుటుంబాలకు పైగా ప్రజలు డా. షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
Markapur: కాంగ్రెస్‌లోకి జమ్మనపల్లి గ్రామానికి చెందిన 18 కుటుంబాలు
మార్కాపూర్: మార్కాపురం మండలం, జమ్మనపల్లి గ్రామానికి చెందిన 18 కుటుంబాలకు పైగా ప్రజలు డా. షేక్ మహబూబ్ వలి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా డా. షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు సమాన గౌరవం ఇస్తుంది. రాజకీయంగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి" అని అన్నారు. APCC అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ జాయినింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినవారు:
కటికల మారకో, పాతర్ల వినయ్, మేకల దావీదు, మేకల సుదర్శన్, కటికల జానయ్య, మేకల సుధాకర్, కటికల లాజర్, మేకల రాంబాబు, మేకల శాంతమ్మ, మేకల చిన్ని, మేకల ఆదం, మేకల సంతోష్, మేకల దేవసహయం, కటికల చిన్న దానియేలు, కటికల సాల్మన్, మేకల ఆనందరావు, కృప, కటికల యేసు, పాతర్ల ఆదం, కటికల యాకోబు, కే ఏసేబు, మేకల దేవదానం, గుడిమెట్ల దేవదానం, ఫార్మిపోగు దేవదానం, మేకల సామేలు, మేకల యాకోబు, శాంసన్, పి. దానయ్య, మేకల సురేష్, కే ఏసు, మేకల ఆశీర్వాదం, కటికల ఇస్మాయిల్, కటికల గురువయ్య, కటికల జేమ్స్, కటికల జాన్, కే దానియేలు యాకోబు తదితరులు.
జమ్మనపల్లి గ్రామ ప్రజలు డా. షేక్ మహబూబ్ వలి గారిని ఘనంగా సన్మానించారు. "కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ సమస్యలను ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ మహబూబ్ సుభాని, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




