Markapur: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధం కలెక్టర్ విజయ సునీత
Markapur: మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ పరిశీలించారు. నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Markapur: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధం కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత తెలిపారు.
శుక్రవారం గిద్దలూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను ఎస్పీ పంకజ్ కుమార్, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తో కలసి కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో పటిష్ట భద్రత కల్పించామని, పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఓటర్లందరూ ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ సునీత విజ్ఞప్తి చేశారు.




