Markapur: కన్నీటిని దిగమింగి.. స్వర్ణాన్ని గెలిచి.. స్ఫూర్తిదాయక విజయం!
Markapur: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జులకొండ గ్రామానికి చెందిన జిముళ్లీముడి నాసరయ్య థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించారు.
Markapur: కన్నీటిని దిగమింగి.. స్వర్ణాన్ని గెలిచి.. స్ఫూర్తిదాయక విజయం!
Markapur: మార్కాపురం జిల్లా, మార్కాపురం మండలం గజ్జులకొండ గ్రామానికి చెందిన జిముళ్లీముడి నాసరయ్య అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఈ నెల 17, 18 తేదీల్లో థాయిలాండ్‌లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2026 అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5000 మీటర్ల వాక్ రేసులో సిల్వర్ మెడల్ సాధించారు.
ఇటీవలే తండ్రిని కోల్పోయిన కుటుంబం ఇంకా దుఃఖంలోనే ఉన్న సమయంలో, నాసరయ్య ఈ పోటీలకు అర్హత సాధించడం విశేషం. తండ్రి లేరనే బాధను అధిగమించి, తల్లి ప్రోత్సాహంతో థాయిలాండ్ వెళ్లి దేశానికి కీర్తి తీసుకువచ్చారు.
నాసరయ్య ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కూడా పలు పతకాలు సాధించారు. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ (PD)గా పనిచేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం అభినందనీయమని స్థానికులు తెలిపారు.
పల్లెటూరి యువకుడు ప్రపంచ స్థాయిలో సాధించిన ఈ విజయంతో గ్రామస్తులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన విజయాన్ని గుర్తించి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




