Markapur: గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు

Markapur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లె జడ్పీ హైస్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల ప్రశ్నపత్రాలను విడుదల చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 27 Aug 2026 9:46 PM IST
Markapur
X

Markapur: గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు

మార్కాపూర్: మార్కాపురం జిల్లా,గిద్దలూరు మండలం పొదలకుంట పల్లెలో చెకుముకి సైన్స్ సంబరాలు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి. స్వరూప రెడ్డి అన్నారు.

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల ప్రశ్నపత్రాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొదలకుంటపల్లెలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందన్నారు.

జన విజ్ఞాన వేదిక గత 38 సంవత్సరాలుగా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుందని విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, సృజనాత్మక శక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. చదువు మనిషికి జ్ఞానాన్ని ఇవ్వాలని, జ్ఞానమే ప్రశ్నించే శక్తినిస్తుందని, ప్రశ్నించే శక్తి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది అన్నారు.

శాస్త్రీయ దృక్పథం ఉన్న విద్యార్థి స్వతంత్రంగా ఆలోచిస్తాడని, శాస్త్రీయ దృక్పథం ఉన్న ఉపాధ్యాయుడు సమాజాన్ని చైతన్య పరుస్తాడని, శాస్త్రీయ దృక్పథం పౌరుడు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాడన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ టాలెంట్ టెస్ట్ ను నిర్వహిస్తూ, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు కె .రామిరెడ్డి మాట్లాడుతూ నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలపై విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలన్నారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ కన్వీనర్ బి. ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సమాజంలో వస్తున్న మార్పులను గమనించాలన్నారు. విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకొని మూఢనమ్మకాలను విడనాడాలన్నారు.

ఎస్ఎంసి చైర్మన్ కాల్వ మహేశ్వరరావు మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడం అన్నది సాధారణ విషయం కాదన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వము చట్టం తీసుకొని రావాలని, దాని ద్వారా అందవిశ్వాసాలు, చాందస భావాలు తగ్గుతాయి అన్నారు. సైన్సును విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఐ. ధనర్జున్ రెడ్డి, ఏ. నాగరాజు, కె. సుబ్బారావు, సిహెచ్. బాల సుందరం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story