Markapur: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ విజయ సునీత ఆదేశాలు!

Markapur: కనిగిరిలో మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించి తగు ఆదేశాలిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Oct 2026 10:04 PM IST
Markapur
X

Markapur: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ విజయ సునీత ఆదేశాలు!

మార్కాపురం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

బుధవారం కనిగిరిలోని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేంద్రాల్లో పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా, లైటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడు అంచెల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM