Markapur: మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష

Markapur: మార్కాపురం జిల్లాలో 3,381 గృహాలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 May 2026 8:48 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష

Markapur: మార్కాపురం జిల్లాలో ఆగస్టు 15 నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఆ శాఖ అధికారులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం గృహ నిర్మాణల ప్రగతి పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణ కోసం కేటాయించిన లేఔట్లలో నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

గతంలో బేస్మెంట్ లెవెల్ లో వదిలేసిన గృహాలను గుర్తించి వాటిని రద్దు చేస్తామన్నారు. నూతన గృహాలు నిర్మించుకునే వారికి డీఆర్ డీ ఏ , మెప్మా ల ద్వారా లోన్స్ ఇప్పిస్తామన్నారు. జిల్లాకు కేటాయించిన మొత్తం 3381 ఇళ్లను ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ ఎంవి.మోహన్ రావు, ఈ ఈ పవన్ కుమార్, డీలు కోటిరెడ్డి, సురేష్ బాబు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story