Markapur: మార్కాపురంలో సబ్సిడీ బియ్యం పంపిణీ ప్రారంభం కలెక్టర్

Markapur: మార్కాపురంలో రేషన్ కార్డుదారులకు 10 కిలోల సబ్సిడీ బియ్యం పంపిణీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 5 Aug 2026 2:48 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో సబ్సిడీ బియ్యం పంపిణీ ప్రారంభం కలెక్టర్

మార్కాపురం: ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలోని ఎస్టేట్ ప్రాంతంలో రేషన్ కార్డుదారులకు 10 కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాన్య ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం రైస్ మిల్లర్ల అవుట్‌లెట్ స్టోర్ల ద్వారా సబ్సిడీ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story