Markapur: విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంలో రూ.2.31 లక్షలు పలికిన వైనం
Markapur: మార్కాపురం మెయిన్ బజార్ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలం ఘనంగా నిర్వహణ. రూ.2.31 లక్షలకు లడ్డూను దక్కించుకున్న డాక్టర్ లావణ్య కాశీరావు.
Markapur: విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంలో రూ.2.31 లక్షలు పలికిన వైనం
మార్కాపూర్: మార్కాపురం మెయిన్ బజార్‌లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ ప్రసాదం వేలం పాట ఘనంగా నిర్వహించారు.
భక్తులు, వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంలో డాక్టర్ లావణ్య కాశీరావు రూ.2,31,116లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనంతరం ఆమె లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం పొందారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ, యూత్ కమిటీ సభ్యులు డాక్టర్ లావణ్య కాశీరావును ఘనంగా సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
కార్యక్రమంలో ధర్మకర్త దోగిపర్తి శ్రీనివాసరావు, అధ్యక్షులు పెనుగొండ కేశవరావు, కార్యదర్శి కందెపు హనుమంతరావు, కోశాధికారి సూరే సురేంద్ర, కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రథోత్సవం, నిమజ్జనం రోజున ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ శాశ్వత ఉభయ దాతగా, జై వీరాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ శాశ్వత ప్రసాద ఉభయ దాతగా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




