Markapur: మార్కాపురం ఇంటెలిజెన్స్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు అవార్డు

Markapur: మార్కాపురం ఎస్వీకేపీ కళాశాలలో కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఇంటెలిజెన్స్ అధికారి సుస్వరాజ్ ప్రవీణ్ కుమార్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 Aug 2026 4:22 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం ఇంటెలిజెన్స్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు అవార్డు

మార్కాపూర్: మార్కాపురం పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించినందుకు సుస్వరాజ్ ప్రవీణ్ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా ప్రవీణ్ కుమార్ అవార్డును అందుకున్నారు.

ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, విధి పట్ల అంకితభావం, అప్రమత్తత, సమాచార సేకరణలో నైపుణ్యం, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు.

పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన ప్రవీణ్ కుమార్‌కు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా స్థాయిలో పురస్కారం లభించడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరింత అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story