Markapur: ఘనంగా కందుల రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
Markapur: మార్కాపురంలో టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, కందుల వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
Markapur: ఘనంగా కందుల రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
మార్కాపురం: టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరులు కందుల రామిరెడ్డి, కందుల వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు మార్కాపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
జన్మదిన వేడుకల సందర్భంగా మార్కాపురం పట్టణం భారీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఉదయం నుంచే కందుల రామిరెడ్డి నివాసానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సెవెన్ హిల్స్, రాయవరం గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానుల మధ్య కందుల రామిరెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మార్కాపురం జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కందుల రామిరెడ్డి, కందుల వేణుగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ మయూరి కాసిం, మాజీ పట్టణ అధ్యక్షుడు బాల సుబ్బారావు (బాలుడు) పాల్గొన్నారు




