Markapur: వెలుగొండ కెనాల్‌కు కృష్ణా జలాలు - ప్రత్యేక పూజలు
Markapur: పెద్ద దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలుగొండ ఫీడర్ కెనాల్‌కు చేరిన కృష్ణా జలాలు. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఏరిక్షన్ బాబు.
Markapur: వెలుగొండ కెనాల్‌కు కృష్ణా జలాలు - ప్రత్యేక పూజలు
మార్కాపూర్: మార్కాపురం జిల్లాపెద్ద దోర్నాల మండలం గంటవానిపల్లి గ్రామం వద్ద వెలుగొండ ఫీడర్ కెనాల్‌కు కృష్ణా జలాలు చేరడంతో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ గూడూరు ఏరిక్షన్ బాబు కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నెరవేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరడం వల్ల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో పశ్చిమ ప్రకాశం ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




