Markapur: మార్కాపురంలో 1000 బైకులతో భారీ ర్యాలీ
Markapur: వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల కానున్న నేపథ్యంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 1000 బైకులతో భారీ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు.
Markapur: మార్కాపురంలో 1000 బైకులతో భారీ ర్యాలీ
మార్కాపూర్: ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగనున్న సందర్భంగా మార్కాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కృతజ్ఞతా ర్యాలీలో సుమారు 1000 బైకులు పాల్గొన్నాయి.
పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బైకులతో ర్యాలీగా తరలివెళ్లారు.
వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదలతో నాలుగు జిల్లాల ప్రజల చిరకాల కల సాకారం కానుందని, ఈ చారిత్రాత్మక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించినట్లు కూటమి నేతలు తెలిపారు.
Next Story




