Markapur: మార్కాపురం మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
Markapur: మార్కాపురం మున్సిపల్ చైర్మన్‌గా వక్కలగడ్డ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా కొప్పుల నాగజ్యోతి, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం; ఎమ్మెల్యే కందుల హాజరు.
Markapur: మార్కాపురం మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్‌గా వక్కలగడ్డ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా కొప్పుల నాగజ్యోతి, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.
ముందుగా నాయుడుబజార్‌లోని వక్కలగడ్డ మల్లికార్జున నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వేలాది మంది కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచి మున్సిపల్ చైర్మన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. మొత్తం 40 వార్డులకు గాను 39 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క వార్డులో మాత్రమే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. ఇకపై మార్కాపురం పట్టణాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేలాది మంది కూటమి శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.




