Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికలు: రెండో రోజు 88 నామినేషన్ల దాఖలు

Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు కౌన్సిలర్ స్థానాలకు 88 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ 34, వైసీపీ 36, జనసేన 11 నామినేషన్లు సమర్పించాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Oct 2026 6:46 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికలు: రెండో రోజు 88 నామినేషన్ల దాఖలు

మార్కాపురం: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. వార్డు కౌన్సిలర్ స్థానాలకు 88 నామినేషన్లు చైర్‌పర్సన్ అభ్యర్థులుగా మూడు నామినేషన్ సెట్లు దాఖలయ్యాయని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి తెలిపారు.

రెండో రోజు నామినేషన్లలో టీడీపీ నుంచి 34, వైఎస్సార్‌సీపీ నుంచి 36, జనసేన నుంచి 11, సీపీఐ నుంచి రెండు, బీజేపీ నుంచి ఒకటి, ఇతరులు, స్వతంత్రుల నుంచి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వర్షం కురిసినా నామినేషన్ల ప్రక్రియకు అంతరాయం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసామని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు.

మరోవైపు నామినేషన్ కేంద్రాన్ని డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, సీఐలు అల్తాఫ్ హుస్సేన్, మాతంగి శ్రీనివాసులు, ఎస్సైలు విశ్వనాథరెడ్డి, వేమనతో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రానికి ఇరువైపులా 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు చేపట్టారు.

రేపు చివరి రోజు నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM