Dornala: ఎల్‌నినో నివారణకు ఆరుతడి పంటలు సాగు చేయాలి ఏఓ
Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం. ఎల్‌నినో ప్రభావం నుంచి గట్టెక్కేందుకు ఆరుతడి పంటల సాగుపై ఏఓ జవహర్లాల్ నాయక్ సూచన.
Dornala: ఎల్‌నినో నివారణకు ఆరుతడి పంటలు సాగు చేయాలి ఏఓ
దోర్నాల: మార్కాపురం జిల్లా,...!!! దోర్నాల మండలంలోఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు అరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి జవహర్లాల్ నాయక్ సూచించారు. దోర్నాల మండలంలోని రామచంద్రకోట, చిన్నదోర్నాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జవహర్లాల్ నాయక్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణలో భాగంగా రైతులు కంది, మినుము, ఆముదం, చిరుధాన్యాలు వంటి అరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించడం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.
అలాగే ప్రతి రైతు తప్పనిసరిగా రైతు విశిష్ట సంఖ్యను పొందాలని సూచించారు. రైతులు APAIMS 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని స్వయంగా ఈ-పంట నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే వ్యవసాయ సేవలు, ప్రయోజనాలు పొందేందుకు రైతుల వివరాల నమోదు కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో VAAలు రాజేంద్ర ప్రసాద్, పార్వతి, APCNF సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.




