Markapur: రైల్వే జీఎంకు వినతిపత్రం మార్కాపురం ప్రయాణికుల సంఘం
Markapur: మార్కాపురం జిల్లాకు తొలిసారిగా రానున్న రైల్వే జీఎంకు పలు కీలక డిమాండ్లతో వినతిపత్రం. అమృత్ భారత్ పనులు, నూతన రైల్వే లైన్ల ఏర్పాటుపై విజ్ఞప్తి.
Markapur: రైల్వే జీఎంకు వినతిపత్రం మార్కాపురం ప్రయాణికుల సంఘం
మార్కాపూర్: మార్కాపురం జిల్లాకు తొలిసారిగా రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) రానున్న నేపథ్యంలో, జిల్లాకు అత్యంత అవసరమైన రైల్వే అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మార్కాపురం ప్రయాణికుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రైల్వే జీఎంకు పలు కీలక డిమాండ్లతో వినతిపత్రం అందజేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
ప్రధానంగా అమృత్ భారత్ పథకం కింద మంజూరైన మార్కాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అలాగే మార్కాపురం నుంచి శ్రీశైలం వరకు కొత్త రైల్వే మార్గం, ఒంగోలు వరకు కొత్త రైల్వే లైన్, వినుకొండ–సావల్యాపురం–నడికుడి మీదుగా సికింద్రాబాద్‌కు కొత్త రైలు, మార్కాపురం–విశాఖపట్నం నూతన రైలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం వెళ్లే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మార్కాపురంలో రైల్వే ఆధ్వర్యంలో వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
ఈ ప్రతిపాదనలు అమలైతే మార్కాపురం జిల్లాతో పాటు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి, పర్యాటక రంగానికి, వాణిజ్యానికి, ప్రజల రవాణా సౌకర్యాలకు ఎంతో మేలు జరుగుతుందని మార్కాపురం ప్రయాణికుల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు ఓరుగంటి మల్లిక్, కార్యదర్శి ఎన్.సి. నరసింహాచార్యులు, కోశాధికారి కొప్పరపు శ్రీనివాసరావు రైల్వే జీఎంను కోరారు.




