Markapur: మార్కాపురంలో 'రన్ ఫర్ యూనిటీ' ప్రారంభం!

Markapur: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మార్కాపురంలో నిర్వహించిన 'రన్ ఫర్ యూనిటీ'ని OSD నవజ్యోతి మిశ్రా ప్రారంభించి జాతీయ సమైక్యతకు పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 Oct 2026 2:02 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో 'రన్ ఫర్ యూనిటీ' ప్రారంభం!

Markapur: జాతీయ సమైక్యత, దేశ సమగ్రత, సోదరభావం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మార్కాపురంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కోర్టు సెంటర్ వరకు నిర్వహించిన పరుగును ఓఎస్‌డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఐకమత్యంతో మెలగాలని, దేశ ఐక్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా శాంతియుత, సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, యువత జాతీయ సమైక్యత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణతో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM