Markapur: వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదు
Markapur: మార్కాపురంలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు.
Markapur: వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదు
మార్కాపూర్: ఈరోజు మార్కాపురం పట్టణంలో మార్కాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్, మార్కాపురం టౌన్ ఎస్‌ఐ విశ్వనాథ రెడ్డి, మార్కాపురం రూరల్ ఎస్‌ఐ వేమన ఆధ్వర్యంలో డీజేలు, ఆర్కెస్ట్రా నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో డీజేలకు ఎటువంటి అనుమతులు లేవని నిర్వాహకులకు పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.
అలాగే, వినాయక చవితి ఉత్సవాలను ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మార్కాపురం పట్టణ ప్రజలకు పోలీసులు సూచించారు.
పండుగ సందర్భంగా ప్రజలు శాంతిభద్రతలకు సహకరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పోలీసులు కోరారు.




