Markapuram: మార్కాపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో స్పాట్ లో పరిష్కారం
Markapuram: ప్రకాశం జిల్లాలో ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ మార్కాపురం పట్టణంలో రెండవ వారమూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను విజయవంతంగా నిర్వహించారు.
Markapuram: మార్కాపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో స్పాట్ లో పరిష్కారం
Markapuram: మార్కాపురం పట్టణంలోని మాధవి గ్రాండ్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెండో శుక్రవారం కూడా విజయవంతంగా కొనసాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డిఆర్వో వెంకట శివరామిరెడ్డి ,ఆర్డిఓ ప్రభాకర్ రావు పాల్గొని ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్నారు. వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, పింఛన్లు, రెవెన్యూ, గృహాలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు అప్పగించిన అధికారులు, వెంటనే పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు, అధికారులు సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చూపుతున్న చొరవపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.




