Markapur: మార్కాపురంలో రూ.60 లక్షలతో సఖి భవన నిర్మాణానికి భూమిపూజ
Markapur: మార్కాపురం జిల్లా ఆసుపత్రి ఆవరణలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి కలెక్టర్, ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
Markapur: మార్కాపురంలో రూ.60 లక్షలతో సఖి భవన నిర్మాణానికి భూమిపూజ
మార్కాపురం జిల్లా: మహిళలు, బాలికలకు ఒకే చోట సమగ్ర సహాయ సేవలు అందించేందుకు మార్కాపురం జిల్లా ఆసుపత్రి ఆవరణలో రూ.60 లక్షలతో నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనానికి గురువారం భూమి పూజ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, బాలికలు హింసకు లేదా ఇతర సమస్యలకు గురైనప్పుడు తక్షణ రక్షణ, వైద్యం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సేవలను ఒకే వేదికపై అందించడమే సఖి కేంద్రం లక్ష్యమని తెలిపారు.
కేంద్రం నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇంచార్జి పీడీ పద్మావతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




