Markapur: మార్కాపురం రూరల్ ఎస్సై వి. వేమనకు ఉత్తమ పురస్కారం

Markapur: మార్కాపురం రూరల్ ఎస్సై వి. వేమనకు ఉత్తమ సేవా పురస్కారం. కలెక్టర్ ఎం. విజయ సునీత చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేత. అభినందించిన ప్రముఖులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 Aug 2026 10:07 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం రూరల్ ఎస్సై వి. వేమనకు ఉత్తమ పురస్కారం

మార్కాపూర్: విధి నిర్వహణలో ప్రతిభ, నిబద్ధత, విశేష సేవలకు గుర్తింపుగా మార్కాపురం రూరల్ ఎస్సై వి. వేమనకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా చేతుల మీదుగా ఎస్సై వి. వేమన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖకు విశేష సేవలందించినందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. గతంలో పొదిలి ఎస్సైగా పనిచేసిన సమయంలోనూ ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందిన వి. వేమన తన సేవా నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎస్సై వి. వేమనకు ఉత్తమ సేవా పురస్కారం దక్కడంపై మార్కాపురం నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. నిజాయితీ, అంకితభావంతో పనిచేసే పోలీస్ అధికారులకు ఇలాంటి పురస్కారాలు మరింత స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story