Dornala: దోర్నాల మండలంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం
Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటకానిపల్లిలో ఇంటింటికీ తెలుగుదేశం. పాల్గొన్న యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు.
Dornala: దోర్నాల మండలంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం
దోర్నాల: మార్కాపురం జిల్లా, దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని పార్టీ కరపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం నిర్వహించిన గ్రామ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండేళ్లలో యర్రగొండపాలెం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో దోర్నాల మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సాహెబ్, మండల కూటమి నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, దొడ్డ శేషాద్రి ఈదర మల్లయ్య , (చంటి )చిన్న వెంకటేశ్వర్లు కటకానిపల్లి గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




