Markapur: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - టీడీపీ సంఘీభావం

Markapur: మార్కాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 Sept 2026 11:11 PM IST
Markapur
X

Markapur: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - టీడీపీ సంఘీభావం

మార్కాపూర్: మార్కాపురంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు.

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో 53 రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు. నిజం గెలిచిందని, చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు మరింత సేవ చేయడమే లక్ష్యమని కందుల రామిరెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జునతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story