Markapur: మార్కాపురం జడ్పీ ఛైర్మన్‌ పీఠంపై ఆసక్తికర ఐక్యత!

Markapur: మార్కాపురం జడ్పీ ఛైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి, మన్నే రవీంద్ర ఐక్యత. అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడతామని స్పష్టం. టీడీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 Oct 2026 5:52 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జడ్పీ ఛైర్మన్‌ పీఠంపై ఆసక్తికర ఐక్యత!

Markapur: మార్కాపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం టీడీపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ పదవికి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ మన్నే రవీంద్ర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం కీలకంగా మారింది. అయితే ఈ పదవి తమ ఇద్దరిలో ఎవరికి దక్కినా అంగీకారమే అన్నట్లుగా నాయకుల మధ్య సఖ్యత కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

పక్కపక్కనే నిలబడి ఎంపీ మాగుంటకు శుభాకాంక్షలు!

నిన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కందుల రామిరెడ్డి, డాక్టర్‌ మన్నే రవీంద్ర పక్కపక్కనే నిలబడి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు నాయకులు కలిసిమెలిసి కనిపించడం టీడీపీ శ్రేణుల దృష్టిని ఆకర్షించింది.

జడ్పీ ఛైర్మన్‌ పదవి కోసం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, వ్యక్తిగత పోటీ కంటే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన్నే రవీంద్రకు అవకాశం వచ్చినా, కందుల రామిరెడ్డికి అవకాశం దక్కినా ఇద్దరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తార అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మొత్తానికి మార్కాపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇద్దరిలో ఎవరికి అవకాశం కల్పించాలన్నది టీడీపీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మరి అధిష్ఠానం మొగ్గు ఎటువైపు..? జడ్పీ ఛైర్మన్‌ పీఠం ఎవరిని వరిస్తుంది..? అన్నది వేచి చూడాలి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM