Markapuram: కూటమి చైర్మన్ అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ నామినేషన్!
Markapuram: మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున వక్కలగడ్డ మల్లికార్జున్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కందుల ఆశీస్సులతో భారీ ర్యాలీ.
Markapuram: కూటమి చైర్మన్ అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ నామినేషన్!
మార్కాపురం: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల రాజకీయాల్లో ఎట్టకేలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. కూటమి పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆశీస్సులతో నేడు ఉదయం 11 గంటలకు మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు మార్కాపురంలోని నాయుడు వీధిలో ఉన్న తన స్వగృహం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. ఈ ర్యాలీలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు సమాచారం.
మల్లికార్జున్ నామినేషన్ నేపథ్యంలో మార్కాపురం పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. టీడీపీ శ్రేణులు పసుపు జెండాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆశీస్సులతో మల్లికార్జున్ బరిలోకి దిగుతుండటంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమి ఖాతాలో వేసుకునే దిశగా టీడీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. నేటి నామినేషన్, భారీ ర్యాలీతో మార్కాపురం మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.




