Markapuram: మార్కాపురంలో రోడ్లెక్కిన అంగన్‌వాడీలు

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్‌వాడీల భారీ ఆందోళన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 10 July 2026 1:39 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో రోడ్లెక్కిన అంగన్‌వాడీలు

Markapuram: అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్టీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు రూ.26,000 కనీస వేతనం అమలు చేయాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్‌ల విషయంలో అమలులో ఉన్న ఐదేళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, పనిభారం పెంచుతున్న నవచేతన యాప్‌ను రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story