Markapuram: మార్కాపురంలో డ్రగ్స్ వ్యతిరేక గోడపత్రిక ఆవిష్కరణ!
Markapuram: మార్కాపురంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గ్రామీణ ఎస్సై వేమన అవగాహన గోడపత్రికను ఆవిష్కరించారు.
Markapuram: మార్కాపురంలో డ్రగ్స్ వ్యతిరేక గోడపత్రిక ఆవిష్కరణ!
మార్కాపురం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నివేదిత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన పోస్టర్ (గోడపత్రిక)ను మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్సై వేమన మాట్లాడుతూ డ్రగ్స్, పొగాకు, మద్యం వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక, సామాజికంగా తీవ్ర నష్టాలు కలుగుతాయని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నివేదిత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి శ్రీమతి బి. కళావతి మాట్లాడుతూ డ్రగ్స్ వ్యసనం యువతతో పాటు సమాజం, దేశ భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన సమస్య అని అన్నారు. జూలై నెల నుంచి ప్రతి గ్రామం, ప్రతి కళాశాలలో తమ సంస్థ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజారావు, మార్కాపురం ఆటో యూనియన్ నాయకుడు జే. నాగరాజు, టీడీపీ జిల్లా మహిళా నాయకురాలు సిహెచ్. పెద్దక్క, నివేదిత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.




