Markapuram: మార్కాపురం రేపు CCLA జి. జయలక్ష్మి పర్యటన

Markapuram: మార్కాపురంలో CCLA జి. జయలక్ష్మి ఐఏఎస్ పర్యటన. జిల్లాలో పెరిగిన రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలపై కీలక సమీక్ష. బాధితులు తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 July 2026 9:22 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం రేపు CCLA జి. జయలక్ష్మి పర్యటన

మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో రేపు (గురువారం) చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) శ్రీమతి జి. జయలక్ష్మి, ఐఏఎస్ పర్యటించనున్నట్లు సమాచారం. జిల్లాలో పెరుగుతున్న రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

రెవెన్యూ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం పొందాలని పలువురు కోరుతున్నారు. నూతన మార్కాపురం జిల్లాలో రెవెన్యూ శాఖపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రెవెన్యూ సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో CCLA కమిషనర్ పర్యటనకు మరింత ప్రాధాన్యం నెలకొంది. జిల్లాలోని భూ సమస్యలు, పెండింగ్ కేసులు, అవినీతి ఆరోపణలపై ఈ పర్యటనలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. బాధితులు తమకు సంబంధించిన పూర్తి ఆధారాలతో హాజరై సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story