Markapuram: మార్కాపురం జడ్పీ వైస్ చైర్మన్ రేసులో పెద్దారవీడు జడ్పీటీసీ చిన్నానమ్మ
Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి పెద్దారవీడు జడ్పీటీసీ చిలక చిన్నానమ్మ రేసు. సీనియర్ ఎస్సీ మహిళా నేతకు పదవి దక్కుతుందా అని జిల్లాలో ఉత్కంఠ.
Markapuram: మార్కాపురం జడ్పీ వైస్ చైర్మన్ రేసులో పెద్దారవీడు జడ్పీటీసీ చిన్నానమ్మ
మార్కాపురం: మార్కాపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పెద్దారవీడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన చిలక చిన్నానమ్మకు ఈ పదవి కేటాయించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థాయి నుంచి రాజకీయంగా ఎదిగిన చిలక ఇజ్రాయిల్ కుటుంబం టీడీపీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తోంది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కందుల రామిరెడ్డి, గూడూరి ఎరిక్షన్ బాబు నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.
సీనియర్ ఎస్సీ మహిళా జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న చిలక చిన్నానమ్మకు అవకాశం కల్పిస్తే దళిత మహిళా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చిలక చిన్నానమ్మకు జడ్పీ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందా? పెద్దల నిర్ణయంపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.




