Markapuram: మార్కాపురంలో దస్తావేజు లేఖరులతో పోలీసుల ప్రత్యేక భేటీ!
Markapuram: మార్కాపురం పట్టణంలో భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) అల్తాఫ్ హుస్సేన్ దస్తావేజు లేఖరులతో కీలక సమావేశం నిర్వహించారు.
Markapuram: మార్కాపురంలో దస్తావేజు లేఖరులతో పోలీసుల ప్రత్యేక భేటీ!
Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల భూ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.డి.కే. అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు.
మంగళవారం మార్కాపురంలోని దస్తావేజు లేఖరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. క్రయ, విక్రయదారులకు తెలియకుండా డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం సహించబోమన్నారు.
దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చిన్న పొరపాటు వల్ల జీవితాంతం ఇరువర్గాలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు తప్పనిసరిగా 1-B, అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) వంటి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని డాక్యుమెంట్ రైటర్లకు సూచించారు.
ఇకపై మార్కాపురంలో జరిగే రిజిస్ట్రేషన్లపై పోలీసులకు ఫిర్యాదులు వస్తే సంబంధిత వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి, పోలీసు సిబ్బంది మరియు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.




