Markapuram: కొనకనమిట్ల నామినేషన్ కేంద్రంలో కలెక్టర్, జేసీ తనిఖీలు!

Markapuram: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

MADARVALI, MARKAPURAM
Published on: 23 Oct 2026 3:48 PM IST
Markapuram
X

Markapuram: కొనకనమిట్ల నామినేషన్ కేంద్రంలో కలెక్టర్, జేసీ తనిఖీలు!

Markapuram: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను అధికారులు స్వయంగా తనిఖీ చేశారు.

నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అక్కడి పరిస్థితులను పరిశీలించి పోలీసు అధికారులతో మాట్లాడారు. అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లే విధానం, ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన భద్రత, పోలీసుల బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.

నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో అనవసరంగా గుమిగూడే వారిని నియంత్రిస్తూ, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

అలాగే అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM