Giddalur: కంభం చెరువును తనిఖీ చేసిన మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
Giddalur: మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కంభం చెరువును పరిశీలించిన మార్కాపురం కలెక్టర్ ఎం. విజయ సునీత. లోతట్టు ప్రజల సురక్షిత తరలింపునకు ఆదేశం.
Giddalur: కంభం చెరువును తనిఖీ చేసిన మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మురసు తుఫాను ప్రభావంతో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సోమవారం చారిత్రాత్మక కంభం చెరువును క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు నీటి మట్టం, అలుగు పారే పరిస్థితులు, కట్ట భద్రతను ఆమె స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ, తుఫాను వల్ల కలిగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కంభం చెరువు నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, ఇన్-ఫ్లో తీవ్రతను బట్టి ముందస్తు సమాచారంతో గేట్లు/అలుగు నిర్వహణ చేపట్టాలని సూచించారు.
పునరావాస కేంద్రాల ఏర్పాటు:
కంభం చెరువు దిగువ ప్రాంతాలు మరియు లోతట్టు గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల్లో ఆహారం, సురక్షిత తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ప్రమాద హెచ్చరికలు:
చెరువులు, వాగులు, వంకల వద్ద ప్రజలు, పశువులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్‌ను (9248702557) సంప్రదించాలని కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఏపీఎంఐపీ పిడి జన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.




