Markapuram: మార్కాపురంలో 'సే నో టు డ్రగ్స్' అవగాహన కార్యక్రమం

Markapuram: మార్కాపురం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా 'Say No to Drugs' అవగాహన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Nov 2026 7:08 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో 'సే నో టు డ్రగ్స్' అవగాహన కార్యక్రమం

మార్కాపురం: మార్కాపురం జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో “Say No to Drugs” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మార్తాల శ్రీనివాస రెడ్డి, CMO కొంగన శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కలెక్టర్ విజయ సునీత వివరించారు. డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చైతన్యపరచాలని సూచించారు. యువత భవిష్యత్తును కాపాడుతూ మార్కాపురం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయ సునీత,ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆకాంక్షించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM