Markapuram: జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ

Markapuram: మెప్మా జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 Oct 2026 12:48 PM IST
Markapuram
X

Markapuram: జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ

Markapuram: మార్కాపురం పట్టణంలోని మెప్మా నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఐఏఎస్, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ సందర్శించి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఓఎస్డీ అడ్మిన్ నవజ్యోతి మిశ్రా వారితో కలిసి ఉన్నారు.

నామినేషన్ ప్రక్రియకు అవసరమైన రికార్డులు, ఫారాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ విజయ సునీత సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

నామినేషన్ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పోలీసు సిబ్బందికి సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM