Markapuram: ప్లాస్టిక్ రహిత మార్కాపురం కోసం ప్రత్యేక కార్యాచరణ
Markapuram: సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. మార్కాపురంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కీలక సమీక్ష.
Markapuram: ప్లాస్టిక్ రహిత మార్కాపురం కోసం ప్రత్యేక కార్యాచరణ
మార్కాపురం: సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యచరణ తోనే అది సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. శనివారం మార్కాపురంలోని కలెక్టరేట్లో 'ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్' పై మార్కాపురం మున్సిపాలిటీ సిబ్బంది, జిల్లాలోని ఎన్జీవో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ తో భావితరాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
అక్టోబర్ రెండో వారం నాటికి ప్లాస్టిక్ ని తగ్గించేందుకు విడతల వారీగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి ఎన్జీవోల సహకారం ఉంటే చక్కని ఫలితాలు వస్తాయని కలెక్టర్ వివరించారు. ప్రజలు సైతం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, జిల్లాలోని ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.




