Markapuram: గ్రామీణులకు మెరుగైన వైద్యమే లక్ష్యం: కలెక్టర్ విజయ సునీత

Markapuram: రాష్ట్రవ్యాప్త 265 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవంలో మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 6 Oct 2026 2:39 PM IST
Markapuram
X

Markapuram: గ్రామీణులకు మెరుగైన వైద్యమే లక్ష్యం: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం జిల్లా: మార్కాపురం కలెక్టరేట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 265 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతతో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యం, ఆరోగ్య సేవలు వారి గ్రామాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ కీలకంగా మారుతాయని తెలిపారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM