Markapuram: కలెక్టర్ విజయ సునీత స్పెషల్ డ్రైవ్!
Markapuram: మార్కాపురం కలెక్టర్ ఎం. విజయ సునీత చొరవతో రాయవరం కేజీబీవీ పాఠశాల ఆవరణలోని ప్రమాదకర క్వారీలు, పొదలు తొలగింపు. సురక్షితంగా మారిన పాఠశాల ప్రహరీ.
Markapuram: కలెక్టర్ విజయ సునీత స్పెషల్ డ్రైవ్!
Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రత్యేక చొరవతో రాయవరం కేజీబీవీ పాఠశాల ఆవరణకు కొత్త రూపు వచ్చింది. ఇటీవల పాఠశాల తనిఖీ సందర్భంగా ఆవరణలో క్వారీలు, చిల్లచెట్లు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో మైనింగ్ శాఖ అధికారులు క్వారీలను మట్టితో పూడ్చి, ఆవరణను పూర్తిగా చదును చేసి సమస్యను పరిష్కరించారు.
శుక్రవారం మరోసారి పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విజయ సునీత, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్‌లకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. కలెక్టర్ చొరవతో పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా, సురక్షితంగా మారిందని వారు హర్షం వ్యక్తం చేశారు.




