Markapuram: వెలుగొండ నిర్వాసితులకు ఈ నెల 7న ఇళ్ల పట్టాల పంపిణీ కలెక్టర్
Markapuram: వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఈ నెల 7న గోగులదిన్నె, తోకపల్లి కాలనీలలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకాశం కలెక్టర్ విజయ సునీత తెలిపారు.
Markapuram: వెలుగొండ నిర్వాసితులకు ఈ నెల 7న ఇళ్ల పట్టాల పంపిణీ కలెక్టర్
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస గ్రామమైన సుంకేసులకు చెందిన ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందుకున్న నిర్వాసితులకు ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.
మార్కాపురం మండలం గోగులదిన్నె పునరావాస కాలనీలో సుంకేసుల నిర్వాసితులకు, కలనూతల గ్రామానికి చెందిన కొందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా పెద్దారవీడు మండలం తోకపల్లి పునరావాస కాలనీ పరిధిలోనూ పట్టాల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందుకున్న వారు మాత్రమే కార్యక్రమానికి హాజరై ఇళ్ల పట్టాలు తీసుకోవాలని కలెక్టర్ విజయ సునీత కోరారు.
Next Story




