Markapuram: మార్కాపురంలో పొలిటికల్ రగడ.. భారీ పోలీస్ బందోబస్తు
Markapuram: మార్కాపురం జిల్లా కోర్టు వద్ద ఎర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Markapuram: మార్కాపురంలో పొలిటికల్ రగడ.. భారీ పోలీస్ బందోబస్తు
Markapuram: మార్కాపురం జిల్లా కోర్టు వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ శ్రేణులతో కలిసి కోర్టుకు చేరుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆత్మకూరుకు చెందిన కొందరు వ్యక్తులు ఎర్రగొండపాలెంలోని ఓ వైసీపీ నాయకుడి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. వాటిని అడ్డుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని తెలిపారు.
ఈ ఘటనలో వైసీపీకి చెందిన ఏడుగురు నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం అన్యాయమని, రాజకీయ కక్షతో అమాయకులను ఇరికించారని ఆరోపించారు. కేసును నిష్పాక్షికంగా విచారించి నిర్దోషులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.




