Markapuram: దర్గ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పులుసు పద్మావతి పేరు ఖరారు!
Markapuram: మార్కాపురం జిల్లా కంభం మండలం దర్గ గ్రామ పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పులుసు పద్మావతి పేరును ప్రకటించగా, మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మద్దతు తెలిపారు.
Markapuram: దర్గ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పులుసు పద్మావతి పేరు ఖరారు!
మార్కాపురం: మార్కాపురం జిల్లా కంభం మండలం దర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పులుసు పద్మావతి (భర్త: గోపాలకృష్ణ) పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆమెకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
దర్గ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజగోపాల్, మాజీ సర్పంచ్ బత్తుల కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నెమలిదిన చెన్నారెడ్డి, గొంగటి చెన్నారెడ్డి పాల్గొన్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై పద్మావతి అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




