Markapuram: నేటి నుంచి మే 31 వరకు ఇళ్ల గణన.. విజయవంతం చేయాలని పిలుపు

Markapuram: మార్కాపురం జిల్లాలో జనగణన సర్వేకు కలెక్టర్ ఎం. విజయ సునీత శ్రీకారం చుట్టారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 May 2026 4:09 PM IST
Markapuram
X

Markapuram: నేటి నుంచి మే 31 వరకు ఇళ్ల గణన.. విజయవంతం చేయాలని పిలుపు

మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కొత్తపల్లి గ్రామంలో జనగణన సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శుక్రవారం పరిశీలించారు. మే 1 నుంచి మే 31 వరకు నిర్వహించనున్న ఇళ్ల గణన (ఫేజ్-1)ను విజయవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసారి జనగణనను తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారని చెప్పారు.

ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని ఆమె కోరారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన గణాంకాలు లభించి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ఉపయోగపడుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వేను సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story