Markapuram: గ్రామాల్లో ప్రజా ఉద్యమంగా 'స్వచ్ఛ పదం'

Markapuram: మార్కాపురం జిల్లాలో పరిశుభ్రతే లక్ష్యంగా "స్వచ్ఛ పదం" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 April 2026 2:10 PM IST
Markapuram
X

Markapuram: గ్రామాల్లో ప్రజా ఉద్యమంగా 'స్వచ్ఛ పదం'

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఈరోజు “స్వచ్ఛ పదం” కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, మండల ప్రధాన కేంద్రాలు, హైవేల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.

ప్రత్యేకంగా పెద్దారవీడు మండలం నుంచి వెళ్లే కనెక్టివిటీ రోడ్లు, ప్రతి పల్లెలోని ప్రధాన రహదారులు, హైవేలకు అనుసంధాన మార్గాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలవాలని, పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రతి బుధవారం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని “స్వచ్ఛ పదం” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి బాలునాయక్, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, పెద్దారవీడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాన్ సుందరం, డిప్యూటీ ఎంపీడీవో వి. శ్రీనివాస్, మార్కాపురం డిప్యూటీ ఎంపీడీవో స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శులు శ్రీహర్ష, మల్లెల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story