Markapuram: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: విజయ సునీత!

Markapuram: మార్కాపురం జిల్లాలో ఎన్నికలను నిష్పాక్షికంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 Oct 2026 6:48 PM IST
Markapuram
X

Markapuram: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: విజయ సునీత!

మార్కాపురం: మార్కాపురం జిల్లా పరిధిలో ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.హెచ్. శ్రీధర్‌తో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో ఎన్నికల సన్నద్ధతపై సమగ్రంగా వివరించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీరు, మరుగుదొడ్లు, షామియానాలు, ర్యాంపులు వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బహుళ అంచెల భద్రతతో పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులు సి.హెచ్. శ్రీధర్ సంతృప్తి వ్యక్తం చేసి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, డీఆర్ఓ శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM