Markapuram: దోర్నాల నూతన ఎంపీపీగా భూమని నాగమ్మ ప్రమాణ స్వీకారం!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండల నూతన ఎంపీపీగా భూమని నాగమ్మ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
Markapuram: దోర్నాల నూతన ఎంపీపీగా భూమని నాగమ్మ ప్రమాణ స్వీకారం!
మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాలరావు, ఎంపీడీవో విజయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దోర్నాల మండల నూతన ఎంపీపీగా ఎన్నికైన భూమని నాగమ్మతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాలరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండలంలోని 13 మంది ఎంపీటీసీలకు గాను 12 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన ఎంపీపీ భూమని నాగమ్మ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై నిరంతరం అవగాహన కలిగి ఉంటానని తెలిపారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.




