Markapuram: పొదిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు ఘన విజయం!
Markapuram: మార్కాపురం జిల్లా పొదిలి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ముద్దుల శ్రీనివాసులు 13,481 ఓట్ల భారీ మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించారు.
Markapuram: పొదిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు ఘన విజయం!
మార్కాపురం: మార్కాపురం జిల్లా పొదిలి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ముద్దుల శ్రీనివాసులు ఘన విజయం సాధించారు. జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జనసేన పార్టీ అభ్యర్థి ముద్దుల శ్రీనివాసులు తన సమీప ప్రత్యర్థిపై 13,481 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల మద్దతుతో ముందుకు సాగిన ముద్దుల శ్రీనివాసులు ఓట్ల లెక్కింపులో భారీ ఆధిక్యతను కనబరిచి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు.
ఈ విజయంతో జనసేన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. విజయవార్త వెలువడగానే జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటూ అభ్యర్థి ముద్దుల శ్రీనివాసులుకు అభినందనలు తెలియజేశారు. భారీ మెజారిటీతో గెలిపించిన పొదిలి మండల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.




