Markapuram: మార్కాపురం జిల్లాలో మీకోసం కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
Markapuram: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ‘మీకోసం (PGRS)’ కార్యక్రమం నిర్వహించారు.
Markapuram: మార్కాపురం జిల్లాలో మీకోసం కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
Markapuram: మార్కాపురం జిల్లా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో "మీకోసం (PGRS)" కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు మరియు ఇతర పోలీసు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు అందగా, వాటిలో భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు తదితర అంశాలు ఉన్నాయి. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
అలాగే ఫిర్యాదుల వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి, త్వరితగతిన విచారణ పూర్తి చేసి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే కాకుండా, బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు. నాగరాజు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, కంభం సీఐ కె. మల్లికార్జునరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




